మోఖి (చైనా) : జూనియర్ ఆసియా కప్‌లో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్.. 19-0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఏకంగా 18 పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచిన మన అమ్మాయిలు.. దాయాదిని చిత్తుచిత్తుగా ఓడించి పతకానికి రెండడగుల దూరంలో నిలిచారు.
తొలి రెండు క్వార్టర్స్‌లో ఐదేసి గోల్స్ చేసిన భారత్.. ఆఖరి క్వార్టర్లోనూ ఆరు గోల్స్ కొట్టింది. పూజా మాలిక్ (27, 49, 51వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా రోష్ని, తనూజా, సుప్రియ, మధు, సనిక తలా రెండు గోల్స్ చేశారు.