జ్వెరెవ్ ఈజీగా.. గాఫ్ కష్టంగా
యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), అమెరికా అమ్మాయి కోకో గాఫ్ సెమీఫైనల్స్ చేరుకున్నారు. గురువారం రాత్రి జరిగిన క్వార్టర్స్ పోరులో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించి లాస్ట్-4కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్.. 6-2, 7-5, 6-1తో బోటిక్ వాన్ డ జండ్షుల్ఫ్ (నెదర్లాండ్స్)పై సునాయస విజయం సాధించాడు. తొలి రెండు మ్యాచ్‌లలో సుమారు నాలుగున్నర గంటల మారథాన్ పోరును ఎదుర్కున్న ఈ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్..
- సెమీస్ చేరిన స్టార్ ప్లేయర్లు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), అమెరికా అమ్మాయి కోకో గాఫ్ సెమీఫైనల్స్ చేరుకున్నారు. గురువారం రాత్రి జరిగిన క్వార్టర్స్ పోరులో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించి లాస్ట్-4కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్.. 6-2, 7-5, 6-1తో బోటిక్ వాన్ డ జండ్షుల్ఫ్ (నెదర్లాండ్స్)పై సునాయస విజయం సాధించాడు. తొలి రెండు మ్యాచ్‌లలో సుమారు నాలుగున్నర గంటల మారథాన్ పోరును ఎదుర్కున్న ఈ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్.. తర్వాత ఆడిన 4 మ్యాచుల్లో మాత్రం వరుస సెట్లలో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరాడు.
రెండో సెట్లో మినహా బోటిక్ నుంచి జ్వెరెవ్‌కు కనీస ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. సెమీస్‌లో అతడు రష్యా ప్లేయర్ కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. కాగా ఒక సీజన్లో ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్స్ టోర్నీల్లోనూ సెమీస్ చేరడం జ్వెరెవ్ కెరీర్లో ఇదే తొలిసారి. మరో క్వార్టర్స్‌లో ఖచనోవ్.. 6-2, 7-5, 3-2తో అలగ్జాండర్ బ్లాక్ (బెల్జియం)ను ఓడించాడు. గాయంతో బ్లాక్ ఆట నుంచి తప్పుకోవడంతో ఖచనోవ్ సెమీస్ బెర్తు ఖాయమైంది. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ గాఫ్.. 2-6, 7-6 (9/7), 6-2తో రష్యా భామ మిరా ఆండ్రీవాను చిత్తుచేసింది. లాస్ట్-4లో ఆమె కజకిస్థాన్ అమ్మాయి రిబకినాతో తలపడనుంది.

Zverev
సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఉత్కంఠ పోరులో 26 నిమిషాల్లోనే ముగిసిన తొలి సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయినా తర్వాత పుంజుకున్న గాఫ్ రెండో సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లింది. ఆఖరి సెట్లో మాత్రం సొంత అభిమానుల మద్దతుతో రెచ్చిపోయిన ఈ నల్లకలువ.. ఆండ్రీవాకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. ఇదిలాఉండగా 1975 తర్వాత యూఎస్ ఓపెన్ (మహిళల సింగిల్స్)లో టాప్-4 సీడ్స్ సెమీస్ చేరుకోవడం ఇదే ప్రథమం కాగా 2009 వింబుల్డన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఇది మొదటిసారి. సబలెంకా (1), రిబకినా (2), పెగులా (3), గాఫ్ (4) యూఎస్ ఓపెన్ సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

