ఢిల్లీ: ఈనెల 13న ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మొదలవ్వాల్సిన టీ20 సిరీస్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తెలిపింది. సెప్టెంబర్ 12, 13న దేశ రాజధానిలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతుండటంతో భద్రత, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా తొలి టీ20 షెడ్యూల్ మార్చాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు డీడీసీఏను కోరారు. కానీ పోలీసులతో సమావేశం అనంతరం డీడీసీఏ స్పందిస్తూ.. ‘షెడ్యూల్ ప్రకారమే సిరీస్‌ను నిర్వహిస్తాం’ అని తెలిపింది.