మరో 9 దవాఖానల్లో ఎంఆర్ఐ సేవలు
రాష్ట్రంలో కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అదనంగా 485 వెంటిలేటర్లు కొనుగోలు చేసి అవసరమైన హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
- మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అదనంగా 485 వెంటిలేటర్లు కొనుగోలు చేసి అవసరమైన హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో 9 ఎంఆర్ఐలు, 50 సీటీ స్కాన్ యంత్రాలు, 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్య పరికరాలు కొనుగోలు చేయడంతోపాటు వాటి నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్య పరికరాలు నిరంతరం పనిచేయాలంటే శిక్షణ పొందిన టెక్నీషియన్లు కీలకమని అన్నారు.
సదరం సర్టిఫికెట్ల జారీలో జాప్యం : సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తేతెలంగాణ): సదరన్, యూడీఐడీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో దివ్యాంగుల చేయూత పింఛన్లు ఆలస్యమవుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. శాసనమండలిలో గురువారం దివ్యాంగులకు పింఛన్ల మంజూరుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తాత్కాలిక సర్టిఫికెట్ల విధానాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 4,66,351 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. అర్హులైన దివ్యాంగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిందని, చివరి తేదీ సెప్టెంబర్ 15 నాటికి దివ్యాంగుల క్యాటగిరీ కింద 1,23,199 దరఖాస్తులు అందాయని వెల్లడించారు. దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పరిష్కరిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

