న్యూఢిల్లీ/దార్వాడ్ : ముస్లింలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఎన్నికల్లో లబ్ధిపొందేలా, ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉన్న ఈ నిర్ణయాన్ని వచ్చే నెల 9 వరకు అమలు చేయవద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ స్పందనను తెలియజేయడానికి కొంత సమయం కావాలని తుషార్ మెహతా కోర్టును కోరారు.