CAA | సీఏఏకు వ్యతిరేకంగా 237 పిటిషన్లు.. మార్చి 19న సుప్రీంలో విచారణ
మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) అమలును నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
CAA | న్యూఢిల్లీ, మార్చి 15: మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) అమలును నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో 237 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) సహా పలువురు పిటిషన్‌దారులు సీఏఏ నోటిఫికేషన్‌లోని పలు నిబంధనల్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిపైనా ఈ నెల 19న ఒకేసారి విచారణ జరపడానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు.
సీఏఏపై అమెరికా వ్యాఖ్యలు కల్పితం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై అమెరికా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అమెరికా వ్యాఖ్యల్ని భారత్ తిరస్కరిస్తూ..ఘాటుగా స్పందించింది. ‘సీఏఏ అమలుకు సంబంధించి అమెరికా చేసిన ప్రకటన కల్పితం. అనవసరమైందని మేం భావిస్తున్నాం. దేశ విభజన అనంతరం చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దు’ అని భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీఏఏ నోటిఫికేషన్‌పై తాము ఆందోళన చెందుతున్నామని.. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడటం ప్రజాస్వామ్య మూల సూత్రమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం వ్యాఖ్యానించారు.
సీఏఏ మొబైల్ యాప్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆవిష్కరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ, indiancitizenship.nic.in వెబ్సైట్ ద్వారా కానీ ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. సీఏఏ-2019 మొబైల్ యాప్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చట్టం ప్రకారం అర్హులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఓ పోర్టల్‌ను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీఏఏ అమలు కోసం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CAA
- IUML
- Pm Modi
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

