న్యూఢిల్లీ, జూన్ 21: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు తెలుపాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రైతులను కోరారు. పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు రైతుల సంఘీభావం అవసరమని ఆయన అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసన ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. ప్రజలు, విద్యార్థులు జంతర్‌మంతర్ వద్దకు రావాలని పిలుపునిచ్చిన దీప్కే, నీట్ రీ ఎగ్జామ్ తర్వాత విద్యార్థులు ఈ ఆందోళనలో చేరాలని సూచించారు. మీ మద్దతు లేకుండా ఈ ఉద్యమం విజయవంతం కాదని దీప్కే రైతు సంఘాల మద్దతు కోరారు.