Sunita Kejriwal : ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్దితి మెరుగుపరిచి, మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్దేనని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. హరియాణలోని సోహ్నలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు.
దేశంలో ఈ తరహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేజ్రీవాల్ ఒక్కరే చేయగలిగారని, ప్రధాని మోదీ ఇలాంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని ఆమె పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేసేందుకు ప్రధాని మోదీ కుట్రపూరితంగా తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టించారని ఆరోపించారు.
హరియాణ బిడ్డ కేజ్రీవాల్ ఎన్నటికీ ప్రధాని మోదీ ముందు తలవంచబోరని ఆమె స్పష్టం చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన సమయంలో గుజరాత్ ప్రజలు ఆయనకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇక దేశంలోనే హరియాణను గర్వకారణంగా నిలిపిన అరవింద్ కేజ్రీవాల్‌కు రానున్న హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారని, బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :