ముంబై: గత నెలలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని బారామతి సీటు నుంచి ఎన్సీపీ చీఫ్ సునేత్ర పవార్(Sunetra Pawar) ఆధిక్యంలో ఉన్నారు. జనవరి 28వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సీటు కోసం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం ఆమె లీడింగ్‌లో ఉన్నారు. అజిత్ పవార్ మరణం తర్వాత సునేత్ర పవార్‌ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైంది. ప్రమాణం చేసిన ఆరు నెలల్లోగా ఆమె విజయాన్ని సాధించాల్సి ఉంది. అయితే ఎన్సీపీ నేత సునేత్ర ప్రస్తుతం దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
కర్నాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్ర లో మొత్తం ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. కర్నాటకలోఇన భగల్‌కోట్, దేవనగరి, మహారాష్ట్రలోని బారామతి, రాహురి, నాగాలాండ్‌లోని కోరిడంగ్, త్రిపురలోని ధర్మనగర్, గుజరాత్‌లోని ఉమ్రేత్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఏడు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో.. అయిదు స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉన్నది.