సెహోర్ (మధ్యప్రదేశ్), ఆగస్టు 18: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కోటి ఆశలతో వెల్లుల్లి పంట వేసిన రైతులకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. మార్కెట్లో పలుకుతున్న ధర గిట్టుబాటు కాకపోవడంతో చేతికొచ్చిన పంటను రోడ్లపై, నదుల్లో పారబోస్తున్నారు. పంటను ఎగమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సెహోర్ జిల్లాలోని అష్ట అనే పట్టణంలో పార్వతీ నదిలో బ్రిడ్జిపై నుంచి కొందరు రైతులు వెల్లుల్లి పంటను బస్తాల్లో తీసుకొచ్చి పారబోశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ‘వ్యాపారులు కిలో వెల్లుల్లి రూ.1 నుంచి 4కే కొంటున్నారు. కానీ కిలో వెల్లుల్లి ఉత్పత్తి చేసేందుకు రూ.30 నుంచి 40 ఖర్చు అవుతున్నది. పెద్ద మొత్తంలో మేం నష్టాలను చవిచూస్తున్నాం’ అని ఫుల్మొగ్రాకు చెందిన రైతు జంషెడ్ ఖాన్ వాపోయాడు.