Manibhai Naik | కష్టం తెలిసిన కార్పొరేట్ నాయక్.. స్కూల్ టీచర్ కొడుకు నుంచి ఎల్అండ్టీ చైర్మన్‌గా ఎదిగిన అనిల్ సక్సెస్ జర్నీ ఇదీ!
Manibhai Naik | ఎల్ అండ్ టీ.. ఈ పేరు చెబితే ఆకాశహర్మ్యాలు, వంతెనలు, మెట్రో రైళ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు కళ్లముందు కదలాడుతాయి. తలమీద పసుపు పచ్చరంగు హెల్మెట్‌తో బాధ్యతలు నిర్వర్తించే యువ ఇంజినీర్లు గుర్తుకొస్తారు. ఈ మధ్యే ఎల్ అండ్ టీ చైర్మన్‌గా పదవీవిరమణ చేసిన అనిల్ మణిభాయ్ నాయక్ వృత్తి జీవితం కూడా ఐదు దశాబ్దాల క్రితం కంకర రాళ్లు, సిమెంటు ధూళి మధ్యనే మొదలైంది.
Manibhai Naik | ఎల్ అండ్ టీ.. ఈ పేరు చెబితే ఆకాశహర్మ్యాలు, వంతెనలు, మెట్రో రైళ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు కళ్లముందు కదలాడుతాయి. తలమీద పసుపు పచ్చరంగు హెల్మెట్‌తో బాధ్యతలు నిర్వర్తించే యువ ఇంజినీర్లు గుర్తుకొస్తారు. ఈ మధ్యే ఎల్ అండ్ టీ చైర్మన్‌గా పదవీవిరమణ చేసిన అనిల్ మణిభాయ్ నాయక్ వృత్తి జీవితం కూడా ఐదు దశాబ్దాల క్రితం కంకర రాళ్లు, సిమెంటు ధూళి మధ్యనే మొదలైంది.
అనిల్ మణిభాయ్ నాయక్.. పక్కా మధ్యతరగతి కుర్రాడు. తండ్రి స్కూల్ టీచర్. ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లె నుంచి ముంబైకి వలస వచ్చింది ఆ కుటుంబం. దీంతో నాయక్ దేశ వాణిజ్య రాజధానిలో చదువుకున్నారు. గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. వెంటనే నెస్టార్ బాయిలర్స్ అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. తండ్రి మాట కాదనలేక చేరిపోయారు. తన మనసు మాత్రం ఎల్ అండ్ టీ చుట్టే తిరిగేది. ‘అక్కడ ఉద్యోగం చేయడమంటే దేశానికి సేవ చేయడమే.. అనే అభిప్రాయం అప్పుడు ఉండేది, ఇప్పుడూ ఉంది’ అంటారు నాయక్. త్వరలోనే తన కల నిజం చేసుకున్నారు నాయక్. జూనియర్ ఇంజినీర్ హోదాలో ఎల్ అండ్ టీ ఆవరణలో అడుగుపెట్టారు. ఆ యువకుడి దృష్టిలో పని ఓ తపస్సు. ప్రతినిత్యం అదే ధ్యాస. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. వారాంతాలు కూడా ఉద్యోగానికే అంకితం. పని పట్ల అతని నిబద్ధతను కంపెనీ గుర్తించింది. కాస్త ఆలస్యమైనా.. పదోన్నతులు ప్రసాదించింది. ముందుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా.. తర్వాత చైర్మన్‌గా కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆయన హయాంలోనే ఇంజినీరింగ్, నిర్మాణ రంగాలలో అగ్రస్థానానికి చేరుకుంది ఎల్ అండ్ టీ. నాయక్ చొరవతో ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకూ విస్తరించింది. ఇప్పుడు, ఎల్ అండ్ టీ వెయ్యికోట్ల పైచిలుకు ప్రాజెక్టులను మాత్రమే తీసుకుంటుంది. టర్నోవర్ రెండు లక్షల కోట్లకు చేరువలో ఉంది.

Landt
అవరోధాలు దాటుకుని..
ఎల్ అండ్ టీని ఇద్దరు డెన్మార్క్ ఇంజినీర్లు స్థాపించారు. హెన్నింగ్ హోలాక్ లార్సెన్, సోరెన్ క్రిస్టియన్ టుబ్రో.. ముంబై ప్రధాన కార్యాలయంగా 1938లో తమ కంపెనీని నమోదు చేశారు. నాయక్ నాయకత్వ బాధ్యతలు చేపట్టే వరకూ అదో సంప్రదాయమైన నిర్మాణ సంస్థ. ఆ దార్శనికుడు ఎల్ అండ్ టీని కొత్త మార్గాల్లో తీసుకెళ్లాడు. ఆ దూకుడు చూసి అంబానీలు అదిరిపోయారు. బిర్లాలు భయపడ్డారు. మెజారిటీ వాటాలను కొనుగోలుచేసి.. హస్తగతం చేసుకునే ప్రయత్నాలూ చేశారు. నాయక్ ఆ వ్యూహాల్ని సమర్థంగా తిప్పికొట్టారు. ఎల్ అండ్ టీని సర్వ స్వతంత్ర సంస్థగా నిలబెట్టారు. గతంలో అక్కడ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు ఉండేవి. దీంతో యువ ఉద్యోగుల ఎదుగుదల స్తంభించిపోయేది. ఫలితంగా వలసలు పెరిగాయి. నాయక్ కూడా ఆ పాలసీ వల్ల నష్టపోయినవాడే. తనకు పన్నెండేండ్ల తర్వాత కానీ తొలి ప్రమోషన్ రాలేదు. ఇప్పుడు ఆ ఆవరణలో నైపుణ్యానికే పదోన్నతులు. ఓ దశలో బిర్లాలు తమ అనుబంధ సంస్థ పేరుమీదున్న పద్నాలుగు శాతం వాటాలను విక్రయించే ప్రయత్నం ప్రారంభించారు. ఆ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని.. ఉద్యోగుల భాగస్వామ్యంలో ఓ ట్రస్టు ఏర్పాటుచేసి.. దానిద్వారా వాటాలు కొనుగోలు చేశారు నాయక్. ఆ చొరవ వల్ల ఇప్పుడు చాలామంది సాధారణ ఉద్యోగులు కోటీశ్వరులు అయ్యారు. నాయక్ ఓ కర్మయోగి. తన అధికారాన్ని బాధ్యతగానే చూశారు. తన పదవీ విరమణకు చాలా ముందే ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ను వారసుడిగా ఎంచుకుని.. నాయకత్వ శిక్షణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యన్‌కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. మన మెట్రో ప్రాజెక్ట్ బాధ్యుడు ఆయనే. నాయక్ తన సంపదలో డబ్భు శాతాన్ని సమాజానికి కేటాయించారు. ‘పరుగు ఆపడం ఓ కళే. నేను పరిగెత్తడం మాత్రమే ఆపేశాను. నడుస్తూనే ఉంటాను’ అంటూ నాయక్ తన నిష్క్రమణ గురించి జోక్ చేస్తారు.
చాలామంది పని పెరిగితే ఒత్తిడికి గురవుతారు. చేతినిండా పనిలేకపోతే ఒత్తిడి నన్ను ఆవహిస్తుంది. పనిలో ఆనందాన్ని ఆస్వాదించగలిగితే.. మరో వ్యసనం నీ దరిదాపుల్లోకి కూడా రాదు. కంపెనీ అభివృద్ధికి నేను పెట్టుకున్న పేరు ‘లక్ష్య’. అదెప్పుడూ గురి తప్పలేదు. నిరుపేదల ఇళ్లు మొదలు, సర్కారు భవంతుల వరకు.. మేమే నిర్మిస్తున్నాం. పరిశ్రమలకు పనిముట్లనే కాదు, సైనికులకు ఆయుధాలూ సమకూరుస్తున్నాం. ఎల్ అండ్ టీ జాతి సేవలో భాగస్వామి. ఆ పేరు అలానే నిలబడాలి. మా ఆవరణలో ప్రొఫెషనలిజం వెల్లివెరియాలి. కాబట్టే, నా పిల్లలను కూడా దూరంగా ఉంచాను. ఇక్కడ అందరూ నిమిత్తమాత్రులే.. ఒక్క ఎల్ అండ్ టీ మినహా!
– అనిల్ నాయక్
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

