సిట్ స్టేటస్ నివేదిక సమర్పించండి.. రామ మందిరం విరాళాల కేసుపై సుప్రీం నోటీసులు
అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు, యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
న్యూఢిల్లీ, జూలై 13: అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు, యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశించిన భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సిట్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సిట్ స్టేటస్ రిపోర్ట్‌ని సీల్డ్ కవర్లో అందచేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియచేశారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల చోరీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు ఫోరెన్సిక్ ఆడిట్, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తును పిటిషనర్లు కోరుతున్నారు.
సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
రామ మందిర విరాళాల చోరీ వివాదం కొనసాగుతున్న తరుణంలో ఆలయ పరిపాలనా వ్యవహారాలకు, దైనందిన కార్యకలాపాల పర్యవేక్షణకు అధిపతిగా వ్యవహరించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) పదవికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 18వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని ట్రస్ట్ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దేశంలోని అత్యంత ముఖ్యమైన మతపరమైన క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన రామ మందిరానికి కొత్త పరిపాలనా అధిపతి నియామకానికి మార్గం సుగమం చేస్తూ ఎంపిక కమిటీ అర్హతా ప్రమాణాలను ఖరారు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ట్రస్ట్ నిర్దేశించిన అర్హతల ప్రకారం అభ్యర్థి వయసు 50-70 ఏండ్ల లోపు ఉండాలి. గ్రాడ్యుయేట్ అయ్యుండి, పరిపాలన/ఆర్థిక రంగంలో 20 ఏండ్లు, అంతకు మించిన అనుభవం ఉండాలి. గతంలో ఆలయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉం టుంది. తప్పనిసరిగా హిందూ మతాన్ని అనుసరించేవారై ఉండాలి. పదవీకాలం మూడేండ్లు ఉంటుంది. తప్పనిసరిగా అయోధ్యలో నివసించాలి. నెలరోజుల్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ట్రస్ట్ తన నోటిఫికేషన్లో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

