న్యూఢిల్లీ: విపరీతమైన పోటీ, తల్లిదండ్రుల ఒత్తిళ్ల వల్లే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.
కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండకూడదని చాలా మంది అనుకున్నప్పటికీ, పాఠశాలల పరిస్థితిని చూడాలని తెలిపింది. పోటీ విపరీతంగా ఉన్నందువల్ల మరో దారి లేక కోచింగ్ సంస్థలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించింది. ముంబై డాక్టర్ అనిరుద్ధ నారాయణ్ మల్పని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.