మహిర్ (ఎంపీ), జనవరి 27 : రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్లేట్లకు బదులుగా చిత్తు కాగితాలు, నోట్ పుస్తకాల నుంచి చింపిన పేపర్లలో ప్రత్యేక మధ్యాహ్న భోజనాన్ని అందించిన ఘటన మహిర్ జిల్లా భాటిగ్వన్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.