శనివారం 30 మే 2020
National - May 20, 2020 , 07:55:07

తీరం వైపు దూసుకొస్తున్న అంఫాన్‌..ఈదురు గాలులు, భారీ వర్షాలు

తీరం వైపు దూసుకొస్తున్న అంఫాన్‌..ఈదురు గాలులు, భారీ వర్షాలు

హైదరాబాద్ : అంఫాన్‌ తుఫాన్‌ తీరంవైపు పరుగులు పెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా, ఆ తర్వాత మహాతుఫాన్‌గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నది. అంఫాన్‌గా పేరు ఖరారైన ఈ తుఫాన్‌ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.  ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెనుతుఫాన్‌ పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా-బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. 

తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులులతో పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరంపై అంఫాన్‌ ప్రభావం బలంగా కనిపిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ తీరం అల్ల కల్లోలంగా మారింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం 50 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సరుగుడు తోటలు సముద్రపు కోతకు గురయ్యాయి. అలల కల్లోలం వల్ల సముద్రం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది.


logo