మళ్లీ మోసానికి కుట్ర
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ విమర్శించారు.
- కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
- ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా మోసం చేసింది
- పార్లమెంట్ ఎన్నికల్లో దగా చేయాలని చూస్తున్నది
- ఆ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టాలి
- పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
- పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభం
మంథని, ఏప్రిల్ 23: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దగా చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి వస్తున్న ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఆ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. రెండు లక్షల రుణమాఫీని చేయాలని, ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25వేల నష్టపరిహారం ఇవ్వాలని, పంటల బోనస్ ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మంథనిలోని మార్కెట్ యార్డులో మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పార్లమెంట్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంటి వెంకటరమణారావుతో కలిసి పుట్ట మధూకర్ ప్రారంభించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పి మాటతప్పిందని మండిపడ్డారు. వరికి బోనస్, 15వేల రైతుబంధు, రుణమాఫీ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కనీసం రైతు రుణమాఫీ ప్రక్రియను కూడా మొదలు పెట్టకపోవడం బాధాకరమన్నారు. నాలుగు నెలల పాలనలో కరెంట్, సాగు, తాగునీటి సమస్యలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లున్నా ఇవ్వలేదన్నారు. పెద్దపల్లి జిల్లాలోనే వేల ఎకరాల్లో పంటలు నష్టపోతే.. ఓ మంత్రి మాత్రం రాష్ట్రం మొత్తంగా మూడు వేల ఎకరాల్లోనే నష్టం జరిగిందనడం బాధాకరమన్నారు. రైతులకు నష్ట పరిహారం ఎగ్గొట్టేందుకే ఇలా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు దేవుళ్లపై ఒట్లు పెట్టి హామీలను అమలు చేస్తానని చెప్పిన సీఎంలు లేరని, ఆ ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజలను నమ్మించేందుకు ఏకంగా దేవుళ్లపైనే ఒట్లు పెడుతూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్న ఏకైక వ్యక్తి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్‌లాల్, మాదాడి శ్రీనివాస్‌రెడ్డి, ఎగోలపు శంకర్‌గౌడ్, శంకేసి రవీందర్, వెల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ, కాయితీ సమ్మయ్య, పెగడ శ్రీనివాస్, ఆసిఫ్, మంథని లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

