రుణమాఫీ చేయకుండా సర్కారు మోసం చేసింది.. పంట రుణం కింద వడ్ల డబ్బులు కొట్టేసుకుని బ్యాంకు చేతులు దులుపేసుకుంది. ఏం చేయాలో, ఎవరిని నిందించాలో తెలియక ఓ రైతు కుటుంబం దిగాలు చెందుతున్నది.
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ విమర్శించారు.