భోపాల్: ఒక కుక్క నవజాత శిశువును నోటకరుచుకెళ్లింది. ఆ శిశువు మరణించినట్లుగా గుర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. (Stray Dog Carrys Newborn) మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 11న రాత్రి వేళ జయస్తంభ్ చౌక్ వద్ద నవజాత శిశువు మృతదేహాన్ని వీధి కుక్క నోటకరుచుకున్నది. ఆ ప్రాంతంలో అటూ ఇటూ అది తిరిగింది. దీనిని కొందరు రికార్డ్ చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారి స్పందించారు. గత నెలన్నర రోజుల్లో ఇలాంటి సంఘటనలు మూడు జరిగినట్లు తెలిపారు. నవజాత శిశువుల మృతదేహాలు ఎవరు పడేస్తున్నారో అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని అన్నారు. అలాగే వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై కూడా ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.