INS Jatayu | లక్షద్వీప్‌లో వ్యూహాత్మక నేవీ స్థావరం.. ‘ఐఎన్ఎస్ జటాయువు’ ప్రారంభం
INS Jatayu | భారత నౌకాదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ (INS Jatayu) నేవీ బేస్‌ను బుధవారం ప్రారంభించింది.
న్యూఢిల్లీ: భారత నౌకాదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ (INS Jatayu) నేవీ బేస్‌ను బుధవారం ప్రారంభించింది. లక్షద్వీప్‌లోని మినికాయ్‌లో ఏర్పాటు చేసిన రెండో నేవల్ బేస్ ‘ఐఎన్ఎస్ జటాయువు’ను నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రారంభించారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, సదరన్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ వీ శ్రీనివాస్, వెస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జే సింగ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయణ ఇతిహాసానికి సంబంధించిన జటాయువు పేరు కొత్త నేవీ స్థావరానికి పెట్టినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కార్యాచరణ సామర్థ్యాన్ని ఇది చాటుతుందని అన్నారు.
కాగా, లక్షద్వీప్ దీవుల్లోని కవరత్తిలో ఇప్పటికే ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ పేరుతో నేవల్ బేస్ ఉంది. కొత్తగా ప్రారంభించిన ‘ఐఎన్ఎస్ జటాయువు’ రెండో నేవల్ బేస్. కొచ్చికి నైరుతి దిశలో 215 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న లక్షద్వీప్ దక్షిణ ద్వీపం మినికాయ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఐఎన్ఎస్ జటాయువు కమాండెంట్‌గా నేవీ కమాండర్ వ్రత్ బాఘేల్ వ్యవహరించనున్నారు.
Deeply honored and proud on Commissioning of the Naval base of INS Jatayu in Minicoy, With the Chief of Navy Staff Admiral R Hari Kumar in presence, ceremony proceeded smoothly,featuring solemn invocations,unveiling of a commemorative plaque and raising of the Naval Ensign.… pic.twitter.com/bVeuGtI0uK
— Praful K Patel (@prafulkpatel) March 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

