Stampede At Shrine Due To Landslide | కొండచరియలు విరిగి పడటంతో పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Stampede At Shrine Due To Landslide | కొండచరియలు విరిగి పడటంతో పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిమ్లా: కొండచరియలు విరిగి పడటంతో పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (Stampede At Shrine Due To Landslide) హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మైరీ గ్రామంలోని డేరా బాబా వద్భాగ్ సింగ్ క్షేత్రాన్ని సందర్శిస్తే దుష్ట శక్తుల నుంచి నివారణ కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న జాతరకు భక్తులు పొటెత్తారు. సోమవారం పౌర్ణమి కావడంతో ఉదయం 5 గంటల సమయంలో పవిత్ర గంగా నది పాదాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో స్నానమాచరించారు.
కాగా, ఆ కొండ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు దొర్లుకుంటూ రావడం చూసి భక్తులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో 9 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే అంబాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మృతులను పంజాబ్‌లోని ఫరీద్కోట్కు చెందిన బిల్లా, బల్వీర్ చంద్గా గుర్తించారు.
మరోవైపు గాయపడిన వారిలో ఐదుగురిని ఉనా జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీరియస్‌గా ఉన్న మరో ఇద్దరిని చండీగఢ్‌లోని పీజీఐకు రిఫర్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకు భక్తులను పవిత్ర స్నానానికి అనుమతించబోమని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

