Stalin : కావేరీ నదీ జలాల వివాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కర్నాటకతో కావేరీ నదీ జలాల వివాదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అఖిలపక్ష భేటీ అనంతరం సీఎం స్టాలిన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేసేందుకు కర్నాటక ప్రభుత్వం నిరాకరించడాన్ని అఖిలపక్ష సమావేశం తీవ్రంగా ఖండించిందని సీఎం పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు, సీడబ్ల్యూఎంఏ ఆదేశాలకు అనుగుణంగా తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ ఆదేశించాలని తాము విజ్ఞప్తి చేశామని స్టాలిన్ వివరించారు. మరోవైపు తమిళనాడుకు 8000 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంపై తమిళనాడు భగ్గుమంది. కర్నాటక కావేరీ నీటిని విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
కర్నాటక తీరుకు నిరసనగా సీపీఐ, సీపీఎం తమిళనాడు వ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తమిళనాడుకు జులై 12 నుంచి జులై 31 వరకూ ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని కావేరీ జలాల రెగ్యులేటరీ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) కర్నాటక ప్రభుత్వానికి సూచించింది. అయితే నీటి కొరత ఎదుర్కొంటున్నామని చెప్పిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య 8000 క్యూసెక్యుల నీటిని మాత్రమే పొరుగు రాష్ట్రానికి విడుదల చేస్తామని చెప్పారు.
Read More :
Shanti | విజయసాయిరెడ్డి వల్లే శాంతికి బిడ్డ పుట్టింది.. సంచలన విషయాలు బయటపెట్టిన భర్త మదన్మోహన్