Shanti | దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య రిలేషన్‌పై ఆమె భర్త మదన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చెప్పినట్లుగా తాము విడాకులు తీసుకోలేదని చెప్పారు. విజయసాయిరెడ్డితోనే శాంతి బిడ్డను కన్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మదన్మోహన్ మీడియాతో మాట్లాడారు. శాంతితో పెళ్లి నుంచి రీసెంట్గా జరిగిన గొడవ దాకా జరిగిన విషయాలను వివరించారు.
‘ శాంతితో నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 2015లో మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. 2017లో రూ.45లక్షలు ఖర్చు పెట్టి దమ్మాయిగూడెంలో డూప్లెక్స్ ఇల్లు కొన్నాం. శాంతి లా చేసి ఉండటంతో ప్రాక్టీస్ చేయమని చెప్పా. ప్రాక్టీస్ కోసం కరీంనగర్ కోర్టుకు వెళ్లేది. 2019లో ఎండోమెంట్ పరీక్ష రాసింది. రిజర్వేషన్ కావడంతో పోస్టింగ్ వచ్చింది. 2020లో వైజాగ్‌లో తొలి పోస్టింగ్ ఇచ్చారు. 2020 జనవరిలో పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లా. కొవిడ్ సమయంలో తిరిగి ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే 2021లో మళ్లీ అమెరికా వెళ్లమని నా భార్య శాంతి ఒత్తిడి చేసింది. ఈ విషయంలో దురుసుగా కూడా ప్రవర్తించింది. దీంతో 2022 జనవరిలో పీహెచ్డీ కోసం మళ్లీ అమెరికా వెళ్లా.’ అని మదన్ తెలిపారు.
‘2022 సెప్టెంబర్‌లో అమెరికా నుంచి రావాలని అడిగింది. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేద్దాం.. వారం రోజులు వచ్చి వెళ్లమని అడిగింది. రూ.4కోట్ల విల్లాను విజయసాయిరెడ్డి రూ.2.5 కోట్లకే ఇప్పిస్తున్నారని చెప్పింది. నేను వద్దని చెప్పా. కానీ శాంతి వినిపించుకోలేదు. దీంతో బలవంతంగానే హైదరాబాద్‌కు వచ్చా. శంషాబాద్‌లోని విజయసాయిరెడ్డి ఫామ్‌హౌస్ వద్దకు వెళ్తే.. అక్కడ ఆయన భార్య సునంద రూ.60 లక్షల నగదు ఇచ్చారు. అక్కడ్నుంచి నేరుగా వైజాగ్ వెళ్లా. మార్గమధ్యలో విజయవాడలో ఉన్న విల్లాను కూడా చూశా. అప్పటికే కోటి రూపాయలు విజయసాయిరెడ్డి ఇచ్చారు. మరో కోటి శాంతి ఇచ్చింది. అలా రూ.2.60 కోట్లతో విల్లాను కొన్నాం. ఆ సమయంలో ఇద్దరం ఫిజికల్ కలిశాం. అయితే అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. 2022 సెప్టెంబర్ 25వ తేదీన తిరిగి అమెరికా వెళ్లిపోయా.’ అని మదన్ అన్నారు.
‘అమెరికా వెళ్లిన తర్వాత తాను ప్రెగ్నెంట్ అని శాంతి చెప్పింది. డౌట్ వచ్చి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా ఎలా ప్రెగ్నెంట్ అయ్యావని అడిగా. దీంతో శాంతి సీరియస్ అయ్యింది. మళ్లీ ఇదే ప్రశ్న అడిగితే చెప్పుతో కొడతా అంది. ఆ గొడవ తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేశా. డ్రాప్స్ పడినా ప్రెగ్నెంట్ అవుతుందని తెలుసుకున్నా. కానీ మేం కలిసే సమయానికే ఆమె 2 నెలల కడుపుతో ఉందని తర్వాత తెలిసింది. నేను సెప్టెంబర్‌లో వస్తే 2023 ఏప్రిల్‌లో శాంతికి డెలివరీ అయ్యింది. ఏడు నెలల కన్నా ముందే డెలివరీ అయ్యింది. అప్పటికే శాంతికి విజయవాడ కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది.’ అని మదన్ తెలిపారు.
‘ అమెరికా నుంచి 2024 జనవరి 3వ తేదీన వచ్చా. అప్పటి నుంచి బిడ్డ ఎవరికి జన్మించిందనే దానిపై ఇద్దరికీ గొడవ అవుతూనే ఉంది. ఐవీఎఫ్ చేయించుకున్నానని నేను అమెరికాలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్‌తో చెప్పింది. అప్పుడు ఐవీఎఫ్ ఎక్కడ చేయించుకున్నావ్? డోనర్ ఎవరు? అని అడిగితే సమాధానం లేదు. పదే పదే ప్రశ్నిస్తే.. విజయసాయిరెడ్డి పేరు చెప్పింది. విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు.. దత్తత తీసుకున్న కూతురు మాత్రమే ఉంది. అందుకే బాబు కావాలంటే కనిపెట్టా అని చెప్పింది. అయినా సరే ఐవీఎఫ్ ఎలా చేయించుకున్నావ్ అని అడిగితే పేర్లు మార్చామని చెప్పింది. కానీ ఐవీఎఫ్ ఏం లేదు.. ఫిజికల్ రిలేషన్‌తోనే బాబు పుట్టాడని తర్వాత తెలుసుకున్నా. దీంతో బాబు తండ్రి పేరు తెలుసుకోవాలని వైజాగ్ అపోలో ఆస్పత్రికి వెళ్లా. అక్కడ మెయిన్ రిజిస్ట్రార్‌లో తండ్రి స్థానంలో నా పేరే ఉంది. కేస్ షీట్ అడిగితే.. అందులో పోతిరెడ్డి సుభాష్ పేరు ఉంది.’ అని మదన్ వివరించారు.
‘ 2022 డిసెంబర్లో ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్లా. అప్పుడు శాంతిని కలుస్తా అంటే ఒప్పుకోలేదు. ప్రెగ్నెన్సీ గురించి అడిగావని కలవనని చెప్పింది. 2023 జనవరి 9వ తేదీన అమెరికా వెళ్లే సమయంలో పోతిరెడ్డి సుభాష్ అనే న్యాయవాదితో పచ్చళ్లు, చైన్, బ్రాస్లెట్ పంపించింది. అలా సుభాష్ పరిచయం ఉండటంతో అతనికి ఫోన్ చేసి అడిగా. అప్పుడు తనకు భార్య, కూతురు ఉందని చెప్పాడు. శాంతికి, ఆమెకు పుట్టిన బిడ్డతో తనకేం సంబంధం లేదని.. డీఎన్ఏ టెస్ట్‌కు కూడా సిద్ధమని చెప్పాడు. దాంతో శాంతికి విజయసాయిరెడ్డికే ఆ బిడ్డ జన్మించాడని నాకు క్లారిటీ వచ్చింది.’ అని మదన్ చెప్పుకొచ్చారు.
శాంతితో నేను విడాకులు తీసుకోలేదు. విడాకుల కోసం నాపై ఒత్తి తీసుకొచ్చింది. 2016లో విడాకులు తీసుకున్నామని శాంతి చూపించిన డాక్యుమెంట్ తప్పు. అది ఈ ఏడాది జూన్ 11వ తేదీన చేసిన సంతకం. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఏ పరీక్షకైనా సిద్ధం అని మదన్‌కుమార్ చెప్పారు.
ఒకసారి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని విజయసాయిరెడ్డి ఇంటికి శాంతి తీసుకెళ్లింది. అక్కడ విజయసాయిరెడ్డి భార్య సునంద మేడమ్‌ను పరిచయం చేసింది. అప్పుడు వాళ్లతో ఒక ఫొటో దిగాం. నా అమెరికా స్కాలర్షిప్ అప్లికేషన్ గురించి విజయసాయిరెడ్డిని అడిగాం. ఢిల్లీలో అప్లికేషన్ మూవ్ చేసి ఆయన హెల్ప్ చేశారు.