Heeralal Nagar | రాజస్థాన్ (Rajasthan) కోటాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మంత్రిని సన్మానిస్తుండగా.. వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మందికి గాయాలయ్యాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలే జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ భజన్‌లాల్ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైంది. సంగోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే హీరాలాల్ నగర్ (Heeralal Nagar) కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత జనవరి 4వ తేదీన తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు. దీంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మంత్రిని సన్మానిస్తున్న సమయంలో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో వేదికపై సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
स्वागत के दौरान टूटा मंच.. बाल-बाल बचे मंत्री हीरालाल नागर#Rajasthannews #BreakingNews #HeeralalNagar #Kota pic.twitter.com/FNl4eqJ445
— Darsh Sharma (@darsh_abhi) January 4, 2024
Also Read..
Pooja Hegde | ఫ్రెండ్ సంగీత్‌లో బుట్టబొమ్మ సందడి.. అరబిక్ కుత్తూ పాటకు స్టెప్పులేసిన పూజా హెగ్డే
Coronavirus | వరుసగా రెండో రోజూ 700కు పైనే కొత్త కేసులు.. నిన్న ఒక్కరోజే 921 మంది డిశ్చార్జ్