భోపాల్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా వేదిక కూలిపోయింది. (stage collapse) దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీకి ప్లాన్ చేశారు.
కాగా, భోపాల్లోని రంగమహల్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం వేదికపైకి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో బరువును తట్టుకోలేక ఆ వేదిక కూలిపోయింది. మధ్యప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మేంద్ర సింగ్ చౌహాన్, ఆ పార్టీ సీనియర్ నేత గులాబ్ సింగ్ సహా ఏడుగురు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు.
మరోవైపు ఈ సంఘటన జరిగినప్పటికీ నిరసన ర్యాలీని కాంగ్రెస్ కొనసాగించింది. అడ్డుగా ఉంచిన బారికేడ్లను తొలగించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వాటర్ క్యానాన్స్తో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాగా, నిరసన వేదిక కూలిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
आज भोपाल में मध्य प्रदेश किसान कांग्रेस के विधानसभा घेराव के दौरान मंच टूटने की दुर्भाग्यपूर्ण घटना घटित हुई जिसमें कांग्रेस परिवार के वरिष्ठ नेता और कई साथी गंभीर रूप से घायल हो गए।
प्रदेश अध्यक्ष श्री @jitupatwari जी ने हॉस्पिटल पहुंच कर उनका हाल जाना एवं डॉक्टरों से बात की। pic.twitter.com/aVFypqprJF
— Bhopal Congress (@Bhopalinc) March 10, 2025
#WATCH | Madhya Pradesh: Several Congress leaders and workers got injured after the stage collapsed during their protest in Bhopal pic.twitter.com/DvtFEMRyOS
— ANI (@ANI) March 10, 2025