Jyoti Malhotra | భారత సైన్యానికి (Indian Army) చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించి మరో కీలక విషయం వెల్లడైంది. కేరళ పర్యాటక శాఖ ప్రచారం (Kerala Tourism Campaign)లో జ్యోతి భాగమైనట్లు వెల్లడైంది.
ఈ విషయాన్ని ఆర్టీఏ తాజాగా బయటపెట్టింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమానికి కేరళ ప్రభుత్వం దాదాపు 41 మంది ఇన్ఫ్లుయెన్సర్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. అందులో జ్యోతి కూడా ఒకరని వెల్లడించింది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వసతి, ప్రయాణ, ఆహార ఖర్చులను కూడా చెల్లించినట్లు తెలిపింది. అంతేకాదు కేరళ పర్యటనలో ఉన్న వారికి వీడియోలను చిత్రీకరించడంలో సాయం చేసేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఆర్టీఏ ప్రకారం.. జ్యోతి మల్హోత్రా రాష్ట్రంలోని కన్నూర్, కోజికోడ్, కొచ్చి, అలప్పుజ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ప్రయాణించి, తన అనుభవాలను యూట్యూబ్ ప్రేక్షకుల కోసం వీడియోలతో డాక్యూమెంటరీ చేసింది. అయితే ఆమె వీడియోల్లో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఆమె కన్నూర్‌లో జరిగిన తెయ్యం షోకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె కేరళ సాంప్రదాయ చీరలో కనిపించింది.
Also Read..
PM Modi | భారత్, పాక్‌ను ఒకే త్రాసులో తూకం వేయలేం : ప్రధాని మోదీ
Himachal Pradesh | 23 ఆకస్మిక వరదలు, 19 క్లౌడ్ బరస్ట్‌లు.. కుండపోత వర్షాలకు హిమాచల్ అతలాకుతలం