PM Modi | భారత్, పాక్‌ను ఒకే త్రాసులో తూకం వేయలేం : ప్రధాని మోదీ
PM Modi | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని (Pahalgam Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తీవ్రంగా ఖండించారు.
PM Modi | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని (Pahalgam Terror Attack) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమన్నారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తోంది. భారత్ మాత్రం ఉగ్రవాద బాధితురాలిగా ఉంది. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మౌనంగా మద్దతు ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన బ్రిక్స్..
బ్రెజిల్‌లోని రియో డీ జెనీరలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి.
‘ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించలేదు.
Also Read..
Pahalgam Terror Attack | పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన బ్రిక్స్..
Donald Trump | బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు.. మరో బాంబు పేల్చిన ట్రంప్
Himachal Pradesh | 23 ఆకస్మిక వరదలు, 19 క్లౌడ్ బరస్ట్‌లు.. కుండపోత వర్షాలకు హిమాచల్ అతలాకుతలం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

