Donald Trump | బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్‌లు.. మరో బాంబు పేల్చిన ట్రంప్
Donald Trump | టారిఫ్‌ల (tariffs) విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా కీలక ప్రకటన చేశారు.
Donald Trump | టారిఫ్‌ల (tariffs) విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ (BRICS) సదస్సు వేళ కీలక హెచ్చరికలు చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ‘అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బ్రిక్స్ అనుకూలంగా ఉన్న ఏదేశానికైనా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’ అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ట్రంప్ నుంచి ఈ హెచ్చిరకలు రావడం సంచలనంగా మారింది.
బ్రెజిల్‌లోని రియో డీ జెనీరలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్ర దాడిని (Pahalgam Terror Attack) బ్రిక్స్ దేశాలు (BRICS) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి.
‘ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండిస్తున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నాయి. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించలేదు.
Also Read..
Pahalgam Terror Attack | పహల్గాం ఉగ్ర దాడిని ఖండించిన బ్రిక్స్..
Donald Trump | హాస్యాస్పదం.. ఎలాన్ మస్క్ పార్టీపై ట్రంప్ వ్యాఖ్యలు
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- BRICS
- Donald Trump
- Pm Modi
- Tariffs
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

