వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. తమ దేశంలో ఎల్లప్పుడూ రెండు పార్టీల వ్యవస్థ ఉంటుందని, మూడో పార్టీని ప్రారంభించడం గందరగోళానికి తావిస్తుందని విమర్శించారు. అది దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించని చరిత్ర చెబుతుందన్నారు. మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని, ఆయనను చూస్తే జాలేస్తుందన్నారు.
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది, పరిపాలన సజావుగా సాగిపోతున్నదని చెప్పారు. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారన్నారు. అయినా అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. దేశంలో మూడో పార్టీ అనేది ఎప్పుడూ విజయవంతం కాలేదని, అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించరని చరిత్ర చెబుతున్నది. రెండు పార్టీల వ్యవస్థను అనుసరిస్తున్న దేశంలో ఇలాంటి మూడో పార్టీ గందరగోళానికి, ఘర్షణలకు తావిస్తుందని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
#WATCH | On Elon Musk launching ‘America Party’, US President Donald Trump says, “It is ridiculous to start a third party. We have had tremendous success with the Republican Party…It has always been a two-party system. Starting a third party adds to confusion…He can have fun… pic.twitter.com/Ly67YKzqYu
— ANI (@ANI) July 6, 2025
మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని విమర్శించారు. మస్క్‌ను చూస్తే జాలేస్తోంది, గత ఐదువారాలుగా ఆయన అదుపు కోల్పోవడం విచారకరం. మా మధ్య బంధాన్ని ముగించే స్థితికి ఆయన చేరుకున్నారు. ఇటీవల దేశ చరిత్రలోనే తొలిసారి ఓ భారీ బిల్లును ఆమోదించుకున్నామని, అది చాలా గొప్ప బిల్లని చెప్పారు. అయితే మస్క్‌కు మాత్రం కాదన్నారు. ఎందుకంటే అందులో ఎలక్ట్రిక్ వాహనాలను (EV) తప్పనిసరి చేయడాన్ని రద్దు చేయడం ముఖ్యాంశం. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. గతంలో దీనికి మద్దతునిచ్చిన మస్క్.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. చాలా తక్కువ సయంలో ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆయన కోరుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు.. తన సన్నిహితులను నాసా చీఫ్‌గా నియమించాలని అనుకున్నారని, అయితే అతడు రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే ఆ నియమకాన్ని ఆపేశామన్నారు. అమెరికా ప్రజలను రక్షించడమే నా కర్తవ్యమని తన పోస్టులో పేర్కొన్నారు.
#WATCH | US President Donald Trump says, “We are working on a lot of things with Israel, and one of the things is probably a permanent deal with Iran…We are close to a deal on Gaza. We could have it this week”
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/VEkZACp8r1
— ANI (@ANI) July 6, 2025