గాజా స్ట్రిప్, జూలై 6: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు అక్కడి షాఫా హాస్పిటల్ అధికారులు ఆదివారం తెలిపారు. కాగా, గత 24 గంటల సమయంలో యుద్ధ ప్రాంతంలో వందకు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్ కమాండ్, కంట్రోల్ నిర్మాణాలు, స్టోరేజి సౌకర్యాలు, ఆయుధగారాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగినట్టు పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం నిమిత్తం శ్వేత సౌధంలో చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దాడి జరగడం గమనార్హం.