తిరువరూర్ (తమిళనాడు), నవంబర్ 5: డెమోక్రాట్ అభ్యర్థి, భారత సంతతకి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షిస్తూ ఆమె పూర్వీకులు నివసించిన తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామప్రజలు శ్రీ ధర్మ శాస్తా ఆలయంలో మంగళవారం అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆమెరికా ఎన్నికల్లో అమె విజయం సాధించాలని పేర్కొంటూ ఆలయ సమీపాన కమలా హారిస్ చిత్రంతో పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
అలాగే మధురైలో కూడా ఒక ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రార్థనలు జరిపారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయం సాధిస్తే గ్రామంలో అన్నదానం నిర్వహిస్తామని స్థానిక కౌన్సిలర్ అరుల్మోజి మీడియాకు తెలిపారు.