ధియోరియా, మే 25: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎత్తుకొన్న ‘400+’ నినాదం విఫలమవుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. మొత్తం లోక్సభ స్థానాలకు(543) గానూ కనీసం మిగిలిన 140 స్థానాల్లోనైనా విజయం సాధించాలని ఆ పార్టీ అనుకొంటున్నదని పేర్కొన్నారు.
యూపీలోని ధియోరియా నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి తరపున అఖిలేశ్ శనివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు గాలి విపరీతంగా వీస్తుందన్నారు. ఫలితాల రోజున కమలం పార్టీకి గట్టి షాక్ తప్పదని, రాష్ట్రంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని అఖిలేశ్ పేర్కొన్నారు.