IMD | దేశంలో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. అదే సమయంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు (northeast monsoon) ప్రవేశించినట్లు తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకినట్లు వెల్లడించింది. ఈ పరిణామాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో జోను వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ఏడాది మే 24న నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉండగా.. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీరాలకు సమీపంలో అరేబియా సముద్రంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈనెల 20 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది వాయుగుండం లేదా తుపానుగా మారే అవకాశముందని అంచనా.
Also Read..
JDU | బీహార్ ఎన్నికలు.. 44 మంది అభ్యర్థులతో జేడీయూ తుది జాబితా రిలీజ్
Karnataka Caste Survey: కులసర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణమూర్తి దంపతులు