హైదరాబాద్ : ఏపీలో భారీ వరదల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో రెండు రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ డివిజన్లోని పడుగుపాడు వద్ద పట్టాలపై నుంచి వరద ప్రవహించడంతో ట్రాక్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో కాచిగూడ – చిత్తూరు (12798), కడప – విశాఖపట్నం (17487) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ – చెన్నై సెంట్రల్ (12616) ట్రైన్‌ను ఖాజీపేట, సికింద్రాబాద్, సులేహళ్లి, గుంతకల్, ధర్మవరం, పాకాల, కట్పడి మీదుగా మళ్లించినట్లు తెలిపింది. న్యూఢిల్లీ – తిరువనంతపురం (12626) రైలును కాజీపేట, సికింద్రాబాద్, సులేహళ్లి, గుంతకల్, యెహలంక, జోలపెట్టై, సలేమ్ మీదుగా మళ్లించినట్లు చెప్పింది. గోరఖ్‌పూర్ – కొచువేలి (12511) రైలును కాజీపేట, సికింద్రాబాద్, సులేహళ్లి, గుంతకల్, యెహలంక, జోలపెట్టై, సలేమ్ మీదుగా దారి మళ్లించినట్లు వివరించింది.