న్యూఢిల్లీ : ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రముఖ నటుడు సోనూ సూద్ (Sonu Sood) తన దాతృత్వ కార్యక్రమాలతోనూ గుర్తింపు పొందారు. ప్రజలకు సాయం అందించే ఎన్నో ఫొటోలు, పోస్టులు, వీడియోలను తరచూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక లేటెస్ట్గా హిమాచల్ ప్రదేశ్‌లో మొక్కజొన్న కంకులను విక్రయిస్తున్న ఓ వ్యక్తి వీడియోను సోనూ సూద్ షేర్ చేశారు.
हमारी भुट्टे की नई दुकान 🌽 ❤️ #supportsmallbusiness pic.twitter.com/dglR0VYVdL
— sonu sood (@SonuSood) June 19, 2023
హిమాచల్‌లోని మనాలి నుంచి సిసు వెళ్లే రోడ్డుపై తన చిన్న స్టాల్ ఎదుట ఆ వ్యక్తి నిలుచుని ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. యూపీలోని జన్పూర్ నుంచి తాను ఇక్కడకు వచ్చి కంకులు విక్రయిస్తున్నానని శేష్ ప్రకాష్ నిషాద్ సోనూ సూద్‌తో చెబుతుండటం ఈ క్లిప్‌లో చూడొచ్చు. తాను రూ. 50కి మొక్కజొన్న కంకులు విక్రయిస్తుంటానని అతడు చెప్పుకొచ్చాడు.
ఆపై వీడియోను వీక్షించే వారిని ఉద్దేశించి సోనూ సూద్ మాట్లాడుతూ ఇతడు పొట్ట కూటి కోసం ఎంతగా కష్టపడుతున్నాడో చూడండని చెబుతారు. మా న్యూ కార్న్ షాప్ చిన్న వ్యాపారులను ఆదుకోండి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌ను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి 4.64 లక్షల మందికి పైగా వీక్షించారు. సోనూ సూద్ నిరాడంబరతను మెచ్చుకున్న నెటిజన్లు మొక్కజొన్న కంకుల విక్రేతకు మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు.
Read More :