న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. సోనియాపై ఈడీ కేసును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు ఆందోళనలో పాల్గొననున్నారు. పార్టీ సీనియర్లు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లనున్నారు.
దీంతో ఏఐసీసీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును పోలీసులు మూసివేశారు. భారీ బందోబస్తుతోపాటు పూర్తిగా బారికేడ్లు ఏర్పాటుచేసి అటువైపు ఎవరిని అనుమతించడంలేదు. కాగా, గత నెలలో రాహుల్ గాంధీని ఈడీ విచారించిన సమయంలోనూ కాంగ్రెస్ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదు రోజుల్లో 50 గంటలపాటు విచారించింది