మున్నార్: కేరళలోని మున్నార్ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ.. బీజేపీ తరపున వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీ ఏమిటి, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడమేమిటి? అదీ కూడా బీజేపీ తరపున అన్న అనుమానం రావడం సహజమే. అయితే మున్నార్‌లో పోటీ చేస్తున్న సోనియా గాంధీ వేరు, కేరళకు చెందిన దురే రాజ్ కాంగ్రెస్ నేత.
ఆయనకు సోనియా గాంధీ అంటే ఎంతో అభిమానం ఉండటంతో తన కుమార్తెకు ఆమె పేరే పెట్టారు. అయితే ఈ కేరళ సోనియా గాంధీకి బీజేపీ నేత సుభాష్‌తో వివాహం కావడంతో ఆమె కూడా అదే పార్టీలో చేరింది. ఇప్పుడు పశ్చిమ కనుమల్లోని ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉన్న మున్నార్ పంచాయతీ 16వ వార్డులో అమె బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.