Sonia Gandhi | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు (discharged from hospital). ఉదర సమస్యలతో (stomach infection) బాధపడుతున్న ఆమె జూన్ 15న ఢిల్లీ (Delhi) లోని సర్ గంగారాం ఆసుపత్రి (Sir Gangaram Hospital)లో చేరిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా చికిత్స పొందిన సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని, డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కాగా, ఉదర సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9వ తేదీన ఇదే ఆసుపత్రిలో సోనియా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.
Also Read..
Amit Shah: ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి : కేంద్ర మంత్రి అమిత్ షా
Bomb Threat | ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ సిద్ధం.. బెంగళూరు ఎయిర్పోర్ట్కు బెదిరింపులు