Honeymoon murder : రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ (Sonam).. రాజా హత్య అనంతరం ఇండోర్ (Indore) కు వెళ్లి వాట్సాప్ మెసేజ్‌లను చెక్ చేయడం కోసం మొబైల్ డాటాను ఆన్చేసింది. ఆ ఫోన్లోని చాట్స్ ఆధారంగా పోలీసులు సోనమ్ దంపతుల దగ్గర మొత్తం నాలుగు మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు.
రాజా హత్య అనంతరం సోనమ్ ఆయన మొబైల్ ఫోన్‌ను పగులగొట్టి లోయలో విసిరేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె దగ్గర ఉన్న మూడు మొబైల్‌లు ఏమయ్యాయనే విషయం తేలాల్సి ఉంది. సోనమ్ ఇప్పటివరకు ఆ మూడు మొబైల్ ఫోన్ ఏమయ్యాయనే విషయాన్ని వెల్లడించడంలేదు. ఆ మొబైల్ ఫోన్లను గుర్తిస్తే కేసులో మరింత పురోగతి కనిపించే అవకాశం ఉంది.
భర్త హత్యకు కొన్ని రోజుల ముందు సోనమ్ రఘువంశీ.. సంజయ్ వర్మ అనే వ్యక్తి 119 ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో అతడికి కూడా ఈ హత్యలో ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు సంజయ్ వర్మ ఫోన్ స్వచాఫ్ చేసి ఉంది. కాగా ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి ఈ నెల 23న హత్యచేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.