న్యూఢిల్లీ : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారిణి సోనాలీ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. 143 ఏళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. దేశ పోలీసింగ్, రైల్వే భద్రత రంగాల్లో ఇది ముఖ్యమైన మైలురాయి వంటి ఘట్టం. ఆమె 1993 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి.
2026 అక్టోబరు 31న పదవీ విరమణ చేస్తారు. ఆమె ఎంపీలో అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్‌గా పని చేశా రు. పోలీస్ శిక్షణ, పరిశోధన సంస్థ ఏడీజీగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. సీబీఐ, బీఎస్‌ఎఫ్‌లలో కూడా సేవలందించారు.