Mothers Cremation | వెండి నగల (Silver Jewellery) కోసం తల్లి దహన సంస్కారాలను (Mothers Cremation) అడ్డుకున్నాడో కొడుకు. అంత్యక్రియలు నిర్వహించకుండా తల్లి చితిపై పడుకొని నిరసన తెలిపాడు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో చోటు చేసుకుంది.
జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్‌నగర్‌లో నివాసం ఉండే 80 ఏళ్ల ఛీటర్ రీగర్ మే 3వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చనిపోయే వరకూ ఆమె తన పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ వద్దే నివసించారు. ఇక అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. అక్కడ కుమారుల మధ్య వివాదం చెలరేగింది. చితికి నిప్పుపెట్టే ముందు ఆమె ఒంటిపై ఉన్న వెండి గాజులు (silver bangles), ఇతర ఆభరణాలను కుటుంబ పెద్దలు గిర్ధారి లాల్‌కు అప్పగించారు. దీంతో చిన్నకుమారుడు ఓం ప్రకాష్ ఇందుకు అభ్యంతరం చెప్పాడు.
వెండి గాజులు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇవ్వకపోతే దహన సంస్కారాలను జరగనివ్వనని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా తల్లి చితిపై పడుకొని నిరసన తెలిపాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడికి ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. గాజులు తనకు ఇవ్వకుంటే.. తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. ఎలాగోలా స్థానికులు అతన్ని బలవంతంగా చితి నుంచి బయటకు లాగారు. అతను తన తల్లి చితిపక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. ఇక చేసేదేమీ లేక ఆ ఆభరణాలను అతడికి అప్పగించడంతో దహన సంస్కారాలకు అంగీకరించాడు. ఈ గొడవ కారణంగా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.
Also Read..
Rajnath Singh | ట్రైలర్ మాత్రమే చూశారు.. సినిమా ముందుంది : రాజ్‌నాథ్ సింగ్
Ceasefire | ఈనెల 18 వరకే కాల్పుల విరమణ : పాక్ మంత్రి ఇషాక్ దార్