Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ (Rajnath Singh) సింగ్ అన్నారు. ఈ ఆపరేషన్‌తో ట్రైలర్ (trailer) మాత్రమే చూశారని.. సినిమా ముందుందని తీవ్రంగా హెచ్చరించారు. భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను ఇవాళ రాజ్‌నాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ (Air Warriors)తో సంభాషించారు. అనంతరం అక్కడ ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. ఇప్పటి వరకూ ఏదైతే చూశారో అది కేవలం ట్రైలర్ మాత్రమే. సరైన సమయంలో ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | Bhuj, Gujarat | Defence Minister Rajnath Singh says, “#OperationSindoor is not over yet. Whatever happened was just a trailer. When the right time comes, we will show the full picture to the world.” pic.twitter.com/13BHeIZgkS
— ANI (@ANI) May 16, 2025
‘పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ 23 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది. త్రివిధ దళాల పరాక్రమం చూసి యావత్ భారతావని గర్విస్తోంది. ఈ ఆపరేషన్‌తో భారత్ సైనిక సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. పాక్‌లోని ప్రతి మూలకూ వెళ్లే సామర్థ్యం మన వైమానిక దళానికి ఉంది. ఆపరేషన్ సిందూర్‌తో అది నిరూపితమైంది. ఈ ఆపరేషన్‌తో మన వైమానిక సామర్థ్యాన్ని పాక్ ప్రత్యక్షంగా చూసింది. పాకిస్థాన్ నేలపై ఉన్న 9 ఉగ్ర స్థావరాలను మన మిలిటరీ ధ్వంసం చేసిన దృశ్యాలను యావత్ ప్రపంచం తిలకించింది. బ్రహ్మోస్ మిస్సైల్ శక్తికి పాక్ వణికిపోయింది’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
Also Read..
Rajnath Singh: ఐఎంఎఫ్ నిధులను ఉగ్రవాదుల కోసం పాకిస్థాన్ వాడుతుంది: రక్షణ మంత్రి రాజ్‌నాథ్
Indian Army | ఇండియన్ ఆర్మీకి తన సేవింగ్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎనిమిదేళ్ల చిన్నారి