అహ్మదాబాద్: భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతీయ మిలిటరీ నిర్వహించిన పాత్రను దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా ప్రశంసలు వస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌తో శత్రు దేశాన్ని డామినేట్ చేయడమే కాదు, దాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై మన వైమానిక దళం తన ఆపరేషన్‌ను ప్రభావవంతంగా నిర్వహించిందన్నారు. మన వైమానిక దళం తన సత్తా, ధైర్యంతో కొత్త దశకు చేరుకున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు.
#WATCH | Gujarat: At Bhuj Air Force Station, Defence Minister Rajnath Singh says, “The entire world has seen how you destroyed nine terrorist camps located on the soil of Pakistan. In the action taken later, several of their air bases were destroyed. During #OperationSindoor,… pic.twitter.com/Ous0ybdG1Y
— ANI (@ANI) May 16, 2025
పాకిస్తాన్‌లోని ప్రతి మూలకు వెళ్లే సామర్థ్యం మన వైమానిక దళానికి ఉందని, ఇదేమీ చిన్నవిషయం కాదని, ఆపరేషన్ సింధూర్‌తో అది నిరూపితమైందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన వైమానిక సామర్థ్యాన్ని పాకిస్థాన్ ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. పాకిస్థాన్ నేలపై ఉన్న 9 ఉగ్రవాద కేంద్రాలను మన మిలిటరీ ధ్వంసం చేసిన దృశ్యాలను యావత్ ప్రపంచం తిలకించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన అనేక వైమానిక బేస్‌లు ధ్వంసమైనట్లు చెప్పారు. బ్రహ్మోస్ మిస్సైల్ శక్తికి పాకిస్థాన్ వణికిందన్నారు.
భారతీయ యుద్ధ విధానం, టెక్నాల మారినట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. నవ భారత సందేశాన్ని మీరు ఈ ప్రపంచానికి చాటారన్నారు. భారత్‌లో తయారీ అయిన ఆయుధాలు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో మిలిటరీ శక్తిగా మారినట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఉగ్రవాదుల మౌళిక సదుపాయాలను పునర్ నిర్మించే ప్రక్రియలో పాకిస్థాన్ ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో.. పాకిస్థాన్‌కు ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, అది టెర్రర్ ఫండింగ్‌తో సమానమే అని ఆయన అన్నారు. బిలియన్ డాలర్లు ఇచ్చిన అంశంపై ఐఎంఎఫ్ పునరాలోచన చేస్తుందని భావిస్తున్నట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
ఐఎంఎఫ్‌కు మేం ఇచ్చిన నిధులను.. పాకిస్థాన్‌కు ఇవ్వవద్దు అని, ఎందుకంటే ఆ నిధులను పాకిస్థాన్ ఉగ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం వాడుకుంటుందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని, ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూశారని, ఇక ముందు సినిమా బాకీ ఉన్నట్లు ఆయన చెప్పారు.