ముంబై : క్రూయిజ్ పార్టీలో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్కు బాలీవుడ్ నటి, మోడల్ సోమి అలి మద్దతుగా నిలిచారు. ఆర్యన్ అమాయకుడని తాను నమ్ముతున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తనకు అంతగా తెలియదని, నిజమేంటో కూడా తనకు తెలియదని, అయితే అసలు డ్రగ్స్ జోలికి వెళ్లని పిల్లలు ఎవరున్నారని సోమి అలి ప్రశ్నించారు.
అమెరికా లేదా భారత్ ప్రదేశం ఎక్కడైనా పిల్లలు ఇలాంటి విషయాలపై అనుభవం కోసం ప్రయత్నిస్తున్నారని..ఆర్యన్ ఖాన్ విషయానికి వస్తే అతడు అమాయకుడని, ఆర్యన్ ఉండకూడని ప్రాంతంలో ఉండకూడని సమయంలో పట్టుబడ్డాడని చెప్పారు. ఇక ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్లో రేవ్ పార్టీపై ఆదివారం ఎన్సీబీ అధికారులు చేపట్టిన దాడిలో ఆర్యన్ ఖాన్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్ను ముంబై కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.