Telecom Subscribers | న్యూఢిల్లీ, మే 3: టెలికం సబ్‌స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు నూతన కస్టమర్లు చేరుకున్నట్లు తెలిపింది.
అలాగే బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లు 92.4 కోట్లకు చేరుకున్నట్లు ట్రాయ్ తన నెలవారి నివేదికలో తెలిపింది. జియోకు కొత్తగా 21.4 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌కు 17.5 లక్షల మంది జతయ్యారు. కానీ, వొడాఫోన్ ఐడియా 6.8 లక్షల మందిని కోల్పోగా, బీఎస్ఎన్ఎల్ 23.5 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4,674 మంది వెళ్లిపోయారు.