Stubble burning | అడ్డుకునేందుకు వచ్చిన అధికారితోనే పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టించిన పంజాబ్ రైతులు.. Video
Stubble burning | పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు కోసిన తర్వాత రైతులు తమ పంటపొలాల్లోని కొయ్యకాలు (వరి కొయ్యలను) తగులబెడుతున్నారు (Stubble burning). ఇది దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు శాపంగా మారింది. ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రం చేస్తున్నది.
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు కోసిన తర్వాత రైతులు తమ పంటపొలాల్లోని కొయ్యకాలు (వరి కొయ్యలను) తగులబెడుతున్నారు (Stubble burning). ఇది దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలకు శాపంగా మారింది. ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రం చేస్తున్నది. ఢిల్లీ వాసులు శ్వాస సంబంధ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
దాంతో పంజాబ్‌లో కూడా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో పంట వ్యర్థాల (కొయ్యకాలు)ను తగులబెట్టకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బఠిండాలోని మొహమా సర్జా గ్రామంలో కొందరు రైతులు తమ పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండగా హర్‌ప్రీత్ సింగ్ అనే అధికారి అడ్డుకున్నాడు. దాంతో రైతులు అధికారిపై తిరగబడ్డారు. రైతు సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకుని సదరు అధికారి చేతిని కొయ్యకాలుకు నిప్పుపెట్టించారు.
పంట వ్యర్థాలను కాల్చివేయవద్దని అడ్డుకునేందుకు వచ్చిన అధికారితోనే రైతులు బలవంతంగా పంట వ్యర్థాలను తగులబెట్టించడంపై సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎక్స్‌లో షేర్ చేశారు. కాగా, ఘటనకు బాధ్యులైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Are they Farmers or goons????? punjab government officer who came to stop farmers from burning stubble in Burj Mehma of Bathinda, Punjab was harassed and forced to burn stubble. @ArvindKejriwal @BhagwantMann @narendramodi @AmitShah @myogiadityanath @nitin_gadkari @CPCB_OFFICIAL pic.twitter.com/vDtslrLZQS
— Ammy Bhardwaj (@AmmyBhardwaj1) November 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

