న్యూఢిల్లీ, జూలై 16: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ఛులపై తనిఖీ చేపట్టాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గత సోమవారం ఆదేశాలు ఇచ్చింది.
ఈమేరకు తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా, తాము నడుపుతున్న బోయింగ్ విమానాల ఇంధన స్విచ్ఛులలో ఎలాంటి సమస్యలు లేవని బుధవారం వెల్లడించింది. మెయింటనెన్స్ షెడ్యూల్లో భాగంగా బోయింగ్ 787-8 విమానంలో కంట్రోల్ మాడ్యూల్లను మార్చినట్టు పేర్కొన్నది.