Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో (Pidia forest) గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు.. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కాల్పుల్లో డీఆర్జీ జవాన్‌తోపాటు మరో సభ్యుడు మృతిచెందగా.. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్ తాజాగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్-దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో చోటు చేసుకున్నది.
Also Read..
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి