షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఇవాళ మంచు కురిసింది. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న వేళ.. స్నో ఫాల్ కురవడం స్థానికుల్లో సంతోషాలు నింపింది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో పట్టణంలోని కొన్ని ప్రదేశాల్లో లైట్‌గా స్నో కురిసింది. ఆ తర్వాత ఆ మంచు తీవ్రమైంది. క్రిస్మస్ వేడుకల కోసం షిమ్లాకు వచ్చి యాత్రికులు ఆ స్నోఫాల్‌తో సంబరాల్లో తేలిపోయారు.
స్నో కురుస్తుంటే టూరిస్టులు గుంపులు గుంపులుగా చిందేశారు. షిమ్లా నుంచి తిరుగు ప్రయాణం కావాలనుకున్న వారు కూడా ఇప్పుడు అక్కడే ఉండిపోయేందుకు డిసైడయ్యారు. షిమ్లాకు సమీపంలో ఉన్న కుఫ్రీ, ఫాగు ప్రదేశాల్లో కూడా ఇవాళ స్నో కురిసింది.
వాతావరణ శాఖ ప్రకారం.. షిమ్లాలో మంచు ఏకధాటిగా కురిసే అవకాశాలు ఉన్నాయి. కిన్నౌర్, లాహౌల్, స్పిటి జిల్లాల్లో స్వల్ప స్థాయి నుంచి మధ్య స్థాయిలో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లోనూ కోల్డ్ వేవ్ ఉండే ఛాన్సు ఉంటుంది.