Elvish Yadav | ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 (హిందీ) విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav)పై కేసు నమోదైంది. పాములు, పాముల విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నోయిడాలోని సెక్టార్ 49లో జరుగుతున్న ఓ రేవ్‌పార్టీ (Rave Party)పై పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు కోబ్రాలు సహా మొత్తం తొమ్మిది పాములు, పాము విషాన్ని (Snake Venom) స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని ప్రశ్నించగా.. ఎల్విష్ పేరు బయటకు వచ్చింది. అతడు నిర్వహించే పార్టీలకు పాములు సరఫరా చేస్తుంటామని వారు వెల్లడించారు. దీంతో ఎల్విష్ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ మేరకు అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు నోయిడా పోలీసు అధికారి విషాల్ పాండే వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎల్విష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ‘ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. ఈ కేసులో నా ప్రమేయంపై 0.1 శాతం మేర నిజం ఉన్నా దానికి పూర్తి బాధ్యత వహిస్తా. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎల్విష్ వీడియో వైరల్ అవుతోంది.
Elvish Yadav issues an official statement addressing the current situation. #ElvishYadav𓃵 #ElvishYadav #Elvish #ElvishArmy #BiggBoss #BIGGBOSS17 pic.twitter.com/YPQTBo5DDk
— Filmy Uncle (@One4you384316) November 3, 2023
Also Read..
Sushmita Sen | రిపోర్ట్స్‌లో అంతా నార్మల్.. అయినా గుండెపోటుకు గురయ్యా : సుష్మితా సేన్
Tiger | పులితో బాలుడి వాకింగ్.. షాకింగ్ వీడియో వైరల్
Delhi Pollution | రాజధాని నగరాన్ని కమ్మేసిన వాయు కాలుష్యం.. డ్రోన్ విజువల్స్