Sushmita Sen | రిపోర్ట్స్‌లో అంతా నార్మల్.. అయినా గుండెపోటుకు గురయ్యా : సుష్మితా సేన్
Sushmita Sen | బాలీవుడ్ స్టార్ నటి (Bollywood Star Actress), మాజీ విశ్వసుందరి (former Miss Universe) సుష్మితా సేన్ (Sushmita Sen) ఇటీవలే గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితా సేన్.. అప్పటి పరిస్థితుల గురించి వివరించింది.
Sushmita Sen | బాలీవుడ్ స్టార్ నటి (Bollywood Star Actress), మాజీ విశ్వసుందరి (former Miss Universe) సుష్మితా సేన్ (Sushmita Sen) ఇటీవలే గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో గుండెపోటుకు గురైనట్లు నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వైద్యులు యాంజియోప్లాస్టీ (Angioplasty) చేసి స్టెంట్ (stent) అమర్చినట్లు వివరించింది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితా సేన్.. అప్పటి పరిస్థితుల గురించి వివరించింది.
ఆ ఘటన జరగడానికి ఆరు నెలల ముందే తాను గుండె సంబంధిత పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించింది. ఆ పరీక్షల్లో అంతా నార్మల్‌గా వచ్చిందని.. అయినప్పటికీ గుండెపోటు బారినపడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఆ ఘటన చాలా అకస్మాత్తుగా, ఊహించని విధంగా జరిగింది. నా తల్లిదండ్రులకు హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయి. జన్యుపరంగా నాకూ ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అందుకే ఏడాదికి రెండు సార్లు (ప్రతి ఆరు నెలలకోసారి) గుండెకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు చేయించుకునేదాన్ని. నాకు గుండెపోటు రావడానికి ఆరు నెలల ముందే అన్ని టెస్ట్‌లూ చేయించుకున్నా. ఆ పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. స్ట్రెస్ టెస్ట్, ఎకో టెస్ట్ అంతా ఓకే. అయినా అకస్మాత్తుగా అలా గుండెపోటు రావడం షాక్ అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.
కాగా, ఈ ఏడాది మార్చిలో సినిమా షూటింగ్ సమయంలో సుష్మితా సేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అక్కడ వైద్యులు నటికి యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘తీవ్రమైన గుండెపోటు నుంచి కోలుకుంటున్నా. మీ ప్రేమే నన్ను బతికించిందని భావిస్తున్నా. నాకు అనారోగ్యం అని తెలిసినప్పటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మీరు పంపిన శుభాకాంక్షలు చూసి ఉద్వేగానికి గురయ్యాను. సకాలంలో వైద్యులు చేసిన చికిత్సతో పునర్జన్మ పొందాను. నన్ను కాపాడిన వైద్యులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. మీతో మాట్లాడేవరకు ఉండలేకపోయాను. త్వరలో ఎప్పటిలాగే నా షూటింగ్స్‌కు హాజరవ్వాలని అనుకుంటున్నా’ అంటూ పోస్ట్ చేసింది.
Also Read..
Tiger | పులితో బాలుడి వాకింగ్.. షాకింగ్ వీడియో వైరల్
Delhi Pollution | రాజధాని నగరాన్ని కమ్మేసిన వాయు కాలుష్యం.. డ్రోన్ విజువల్స్
Rishabh Pant – Axar Patel | తిరుమల శ్రీవారి సేవలో పంత్, అక్షర్ పటేల్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

